హైదరాబాద్: 28°C
వ్యాపారం

BPCLకి రూ.3,962.13 కోట్ల నికర నష్టం

ప్రభుత్వరంగ చమురు సంస్థ BPCL 2026-27 ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో రూ.3,962.13 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2025-26 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,123.93 కోట్ల నికరలాభం ఆర్జించింది. ముడిచమురు 50 శాతం ధర పెరిగినా దేశీయంగా పెట్రోల్, డీజిల్, LPG రిటెయిల్ ధరలను ఆ స్థాయిలో పెంచకపోవడమే నష్టాలకు కారణమని కంపెనీ తెలిపింది.