నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మద్దతు ప్రకటించాడు. దేశంలోని ప్రతి విద్యార్థికి భయం లేని, సురక్షితమైన వాతావరణంలో చదువుకునే హక్కు ఉందన్నాడు. లాఠీచార్జిలు కాకుండా ప్రభుత్వం-విద్యార్థుల మధ్య చర్చల ద్వారానే ఈ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుందని తెలిపాడు. దేశ భవిష్యత్తు కోసం అందరూ కలిసిరావాలని కోరాడు.
క్రీడలు
విద్యార్థుల పోరాటానికి యువరాజ్ మద్దతు


