హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: భారీ వర్షాలు

TG: నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.