హైదరాబాద్: 28°C
వ్యాపారం

మరోసారి భగ్గుమన్న చమురు ధరలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి. తాజాగా బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 4.23 శాతం పెరిగి 95.19 డాలర్లకు చేరింది. దీంతో ధరలు ఆరు వారాల గరిష్ఠాన్ని తాకాయి. మరోవైపు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లోనూ చమురు ధరలు పెరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, ఎర్ర సముద్రంలో సౌదీపై హూతీల దిగ్బంధనం తదితర కారణాలు ధరలపై ప్రభావం చూపాయి.