హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమల సమాచారం

AP: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,214 మంది భక్తులు దర్శించుకోగా.. 36,994 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.81 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.