హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీ నష్టాల్లో సూచీలు.. కారణమేంటి?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల బ్రెంట్‌ క్రూడ్‌ ధర 4% పెరిగి 91 డాలర్లకు చేరడంతో ద్రవ్యోల్బణ భయాలు నెలకొన్నాయి. దీనికి తోడు జపాన్‌, దక్షిణ కొరియా మార్కెట్లు 4% నష్టపోవడం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. త్రైమాసిక ఫలితాల వల్ల HDFC బ్యాంక్‌ షేరు 5%, యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 6% మేర పతనం కావడంతో దేశీయ సూచీలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది.