హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు, షెడ్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లలో భక్తులకు అధికారులు అన్ని వసతులు కల్పించారు. నిన్న శ్రీవారిని 90,045 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,573 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.