హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో టోకెన్లులేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు, షెడ్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లలో భక్తులకు అన్ని వసతులు కల్పించారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,096 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,562 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.66 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.