హైదరాబాద్: 28°C
వ్యాపారం

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలతో నష్టమే..!

UPI లావాదేవీలపై MDR ఛార్జీలు విధిస్తే నష్టం వాటిల్లుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కస్టమర్లపై అదనపు భారం పడటమే కాకుండా, డిజిటల్ చెల్లింపుల వినియోగం తగ్గే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఛార్జీల భారం పెరిగితే కంపెనీలు ఇచ్చే దీర్ఘకాలిక ప్రమోషనల్ ఆఫర్లు తగ్గుతాయని, ఫలితంగా ప్రజలు మళ్లీ నగదు లావాదేవీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.