హైదరాబాద్: 28°C
వ్యాపారం

అందుబాటు బడ్జెట్‌లో 8000mAh బ్యాటరీ ఫోన్

ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ నార్జో సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. నార్జో 100X పేరిట 8000mAh బ్యాటరీతో వస్తోంది. సింగిల్ ఛార్జ్‌తో 3 రోజుల బ్యాటరీ లైఫ్‌ ఉంటుందని తెలిపింది. 4GB +128GB వేరియంట్ ధర రూ. 20,999లుగా నిర్ణయించింది. జూలై 22 నుంచి అందుబాటులోకి రానుండగా.. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.2వేల డిస్కౌంట్ ఇచ్చింది.