హైదరాబాద్: 28°C
వార్తలు

లారీని ఢీకొట్టిన టిప్పర్..!

NTR: జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి తాజ్ బిర్యానీ హోటల్ సమీపంలో యూటర్న్ తీసుకుంటున్న లారీని వేగంగా వచ్చిన గ్రావెల్ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ కాలు విరిగినట్లు సమాచారం. ఘటనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఆర్‌ఐ కె. కృష్ణ సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.