హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండోనేషియాలోనూ భిన్న సంస్కృతులు: మోదీ

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండోనేషియా అని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్‌లాగే ఇండోనేషియాలోనూ భిన్న భాషలు, సంస్కృతి, ఆచారాలు ఉన్నాయని చెప్పారు. ప్రజాస్వామ్య ఆవశ్యకత గురించి సుకర్నో, నెహ్రూ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. ఇరు దేశాలు కలిసి నడిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. భారత్‌లాగే ఇండోనేషియా కూడా విజన్-2045 లక్ష్యం వైపు వెళ్తోందన్నారు.