హైదరాబాద్: 28°C
వార్తలు

"సూపర్-50" కార్యక్రమం వెంటనే ప్రారంభించాలి

ASR: జిల్లాలో ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల కోసం "సూపర్-50" ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని జీఎస్‌యూ జిల్లా కార్యదర్శి మాధవరావు మంగళవారం కోరారు. జూన్‌లో ప్రారంభం కావాల్సిన కార్యక్రమం నెల రోజులు గడిచినా ప్రారంభించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. "సూపర్-50" ద్వారా గతేడాది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారన్నారు.