విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేంకటాద్రి ఘాట్ రోడ్డులో కొలువుదీరిన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ వార్షికోత్సవం రేపు సంప్రదాయబద్ధంగా జరుగుతుందని ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యులు పేర్కొన్నారు. ఉదయం 7 గంటకు పంచామృతాభిషేకం, 10 గంటల నుంచి హోమం జరుగుతాయన్నారు. సాయంత్రం 6 గంట నుంచి దేవతామూర్తుల కళ్యాణోత్సవం, అల్పాహార వితరణ జరుగుతాయని వివరించారు.
వార్తలు
రేపు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ వార్షికోత్సవం


