హైదరాబాద్: 28°C
వార్తలు

సమస్యలకు నిలయంగా ఉప్పుగల్లు గ్రామం

JN: సమస్యలకు నిలయంగా ఉప్పుగల్లు గ్రామంలోని రోడ్లు తయారయ్యాయని జఫర్గడ్ మండల బీజేపీ అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ అన్నారు. సోమవారం గ్రామంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. చిన్న పాటి వర్షానికే రోడ్లు చెరువులా తయారవుతున్నాయని ఆరోపించారు. సంబంధిత అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు.