HNK: హన్మకొండ నగరంలో నంబర్ ప్లేట్ లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 20 వాహనాలను సీజ్ చేశారు. ట్రాఫిక్ ఏసీపీ టీ.సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనాలను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు. వాహనదారులు నిబంధనలకు అనుగుణంగా నంబర్ ప్లేట్లు అమర్చుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
వార్తలు
నంబర్ ప్లేట్ లేని 20 వాహనాలు సీజ్
Advertisement
Advertisement
Advertisement


