హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షపు నీటిలో తేలిన పరీక్షా పత్రాలు

Advertisement

బిహార్‌లోని బక్సర్‌లో గల బునియాది పాఠశాల విద్యా కేంద్రంలో 9, 10, 12 తరగతుల త్రైమాసిక పరీక్షల ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల కట్టలు వర్షపు నీటిలో తేలుతూ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విద్యాశాఖ నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వర్షం వల్లే అలా జరిగిందని, పరీక్షా సామగ్రి సురక్షితంగానే ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement