హైదరాబాద్: 28°C
వార్తలు

బాధితుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం

Advertisement

చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో హత్యకు గురైన యాట శ్రీధర్ కుటుంబానికి ఆయన చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచారు. భార్య, నెల రోజుల చిన్నారి ఉన్న కుటుంబాన్ని పరామర్శించి తమ వంతుగా రూ.16 వేల ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనిల్, ప్రశాంత్, రమేష్, బాలాజీ, నందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement