హైదరాబాద్: 28°C
వార్తలు

ఆరేళ్ల తర్వాత ప్రారంభమైన రోడ్డు పనులు

Advertisement

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 43వ డివిజన్‌లో దాదాపు ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను కార్పొరేటర్ వాణిశ్రీ గురువారం పూజలు చేసి ప్రారంభించారు. రోడ్డు మరమ్మతులు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేయించినట్లు ఆమె తెలిపారు. డివిజన్ పరిధిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె ప్రజలను కోరారు.

Advertisement

Advertisement