హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని కార్మికులు డిమాండ్

Advertisement

GNTR: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005ను యథాతథంగా కొనసాగించాలని ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు, తక్కెళ్లపాడు గ్రామాల్లో ఉపాధి కార్మికులు బుధవారం గ్రామ సచివాలయ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు, కౌలు రైతు సంఘాలు మద్దతు తెలిపి పాల్గొన్నారు. రోజువారీ కనీస వేతనాన్ని రూ.600కు పెంచాలని తెలిపారు.

Advertisement

Advertisement