హైదరాబాద్: 28°C
వార్తలు

పీహెచ్‌డీ సాధించిన అనూషకు ఎమ్మెల్యే అభినందనలు

Advertisement

HNK: హసనపర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన రేణుకుంట్ల అనూష ఐఐటీ ఇండోర్‌లో సోషియాలజీ విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఈ సందర్భంగా మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును కలవగా, ఆయన శాలువాతో సత్కరించి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేసి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

Advertisement