VSP: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశాఖ వ్యాలీ స్కూల్ వద్ద మంగళవారం ఉదయం పోలీసులు 56 కేజీల గంజాయిని పట్టుకున్నారు. సీఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఒరిస్సా నుంచి కారులో గంజాయిని రవాణా చేస్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని సీఐ తెలిపారు. ఈ గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వార్తలు
విశాఖలో 56 కేజీలు గంజాయి పట్టివేత
Advertisement
Advertisement
Advertisement


