ATP: అనంతపురం కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ పర్యటన కోసం వర్సిటీ ప్రాంగణంలో ఐదు హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు. ఎస్పీ జగదీష్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
వార్తలు
కేంద్ర వర్సిటీలో 5 హెలిప్యాడ్‌ల ఏర్పాటు
Advertisement
Advertisement
Advertisement


