హైదరాబాద్: 28°C
వార్తలు

వైభవంగా వెంకన్న ఆలయ వార్షికోత్సవం

Advertisement

AKP: మాడుగుల మండలం కేజేపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వక్సేన పూజ, పూర్ణాహుతి, హోమం, చక్రస్నానం తదితర కార్యక్రమాలను జరిపించారు. భక్తులు అధిక సంఖ్య పాల్గొని స్వామిని దర్శించుకుని విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందులో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఆర్.రామకొండరావు పాల్గొన్నారు.

Advertisement

Advertisement