హైదరాబాద్: 28°C
వార్తలు

మళ్లీ హద్దులు దాటిన తమిళనాడు జాలర్లు

Advertisement

తమిళనాడు జాలర్లు మళ్లీ బరితెగించారు. ఏపీలోని నెల్లూరు సముద్రతీరంలోకి చొరబడ్డారు. గోవిందపల్లిపాలెం, శ్రీనివాసపురం తీరంలో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. పాట్రోలింగ్ ఉన్నా తమిళ జార్లు ఖాతరు చేయడం లేదు. స్థానిక మత్స్యకారులను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. భయంతో స్థానిక మత్స్యకారులు చేపలవేట నిలిపివేశారు. తమిళ బోట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement