హైదరాబాద్: 28°C
వార్తలు

బీచ్ లో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

Advertisement

W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం సరదాగా గడపడానికి వచ్చి సముద్రంలో గల్లంతైన పాలిటెక్నిక్ విద్యార్థి సీహెచ్ సుభాష్ (17) మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. మోళ్లపర్రు తీర సమీపంలో సుభాష్ మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు, పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.     

Advertisement

Advertisement