హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాలు కురవాలని దేవుళ్లకు జలాభిషేకాలు

Advertisement

SRCL: తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఆదివారం వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని అన్ని దేవాలయాల్లో జలాభిషేకం చేసి వరుణ దేవుడిని ప్రార్థించారు. పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement