హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిర్‌పోర్టు రోడ్డులో చిరుత కలకలం

Advertisement

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. ఎయిర్‌పోర్టు రోడ్డు మార్గంలో చిరుత కనిపించడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. జనావాసాల్లోకి వచ్చిన ఆ చిరుతను వెంటనే బంధించి తరలించాలని అధికారులను కోరుతున్నారు.

Advertisement

Advertisement