NZB: నగరంలోని సుభాష్‌నగర్ రైతు బజార్ ప్రాంతంలో పేకాట స్థావరంపై నిన్న రాత్రి పోలీసులు దాడి చేశారు. సమాచారం మేరకు త్రీ టౌన్ ఎస్సై హరిబాబు సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ. 4,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
వార్తలు
పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


