AKP: చోడవరం మండలం ముద్దుర్తిలో జంగం చెరువు ఆక్రమణలు తొలగించాలని ఆయకట్టు రైతులు గురువారం తహశీల్దార్ రామారావుకు వినతిపత్రం అందించారు. చెరువు గర్భాన్ని ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతో సాగునీరు అందడం లేదని వారు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 217, 218లోని చెరువులు కూడా ఆక్రమణకు గురైనట్లు తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
చెరువు ఆక్రమణల తొలగింపు డిమాండ్
Advertisement
Advertisement
Advertisement


