BHPL: గోరికొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దళితులపై కుల వివక్ష కొనసాగుతోందంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అగ్రకులానికి చెందిన కొందరు వ్యక్తులు దళితులను కులం పేరుతో దూషిస్తూ అవమానాలకు గురిచేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలపై సంబంధిత అధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టి, కుల వివక్షకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వార్తలు
గోరికొత్తపల్లిలో కుల వివక్ష ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement


