హైదరాబాద్: 28°C
వార్తలు

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Advertisement

కర్ణాటకలోని మాండ్యా జిల్లా ముత్తతి కావేరి నది వద్ద పెను విషాదం చోటుచేసుకుంది. ఫోటోల కోసం నదిలోకి దిగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. కబ్బాలమ్మ, ముత్తితిరాయ ఆలయాల్లో పూజలు ముగించుకుని నది వద్దకు ఆ కుటుంబం వెళ్లింది. మొదట ఫోటోల కోసం నదిలోకి దిగి విజయమ్మ గల్లంతైంది. ఆమెను కాపాడబోయి చైత్ర, శ్వేత, ప్రియాంక, మహేశ్ కన్నుమూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Advertisement