తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 26 నుంచి 28 వరకు జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ఏటా ఈ మాసంలో మూడు రోజుల పాటు ఈ క్రతువును నిర్వహిస్తారు. మొదటిరోజు మలయప్ప స్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసేసి హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండోరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడో రోజు తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని పునఃసమర్పిస్తారు.
భక్తి
రేపటి నుంచి తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం
Advertisement
Advertisement
Advertisement


