హైదరాబాద్: 28°C
వార్తలు

బూర్జ సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Advertisement

ASR: హుకుంపేట మండలంలోని బూర్జ సచివాలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన సచివాలయంలోని రికార్డులను పరిశీలించారు. సచివాలయంలో మొత్తం 9మంది సిబ్బందికి ఒక డిజిటల్ అసిస్టెంట్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. సిబ్బంది గైర్హాజరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

Advertisement

Advertisement