కేరళలోని తన్నితోడు సమీపంలో సుమారు 20 అడుగుల లోతైన బావిలో ప్రమాదవశాత్తు పడిన రెండేళ్ల ఏనుగు పిల్లను అటవీశాఖ అధికారులు సురక్షితంగా రక్షించారు. ఉదయం ఏనుగుల గుంపు గట్టిగా అరవడంతో గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. జేసీబీ సహాయంతో బావి ఒక వైపు మట్టిదారిని ఏర్పాటు చేయడంతో ఏనుగు పిల్ల బయటపడింది. దానిని తిరిగి ఏనుగుల గుంపుతో కలిపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
వార్తలు
VIDEO: బావిలో పడ్డ ఏనుగు పిల్ల.. చివరికి!
Advertisement
Advertisement
Advertisement


