హైదరాబాద్: 28°C
వార్తలు

యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కావద్దు: ఎస్సై

Advertisement

అన్నమయ్య: యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నిమ్మనపల్లె SI రామకృష్ణ సూచించారు. ఆదివారం యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించి, మత్తు పదార్థాల వినియోగం భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు. అనుమానితులకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని,పాజిటివ్ వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి విక్రయాలు, రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Advertisement

Advertisement