హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాల విక్రయాలపై విచారణ

Advertisement

KNR: వావిలాల గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యమే పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫాంలను విక్రయిస్తోందన్న ఫిర్యాదులపై ఎంఈవో హేమలత స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల సమీపంలోని ఇంట్లో పుస్తకాలు నిల్వ ఉంచి అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. విచారణ పూర్తయ్యే వరకు నిల్వ గదికి తాళం వేసి, రెండు రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు.

Advertisement

Advertisement