హైదరాబాద్: 28°C
వార్తలు

యూఏఈలో భారత వీసా, పాస్‌పోర్ట్‌ సేవలకు బ్రేక్‌

Advertisement

యూఏఈలో భారత్ వీసా, పాస్‌పోర్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. జూన్ 26 నుంచి ఐదు రోజుల పాటు ఈ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు యూఏఈలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సేవలను పర్యవేక్షించే అవుట్‌సోర్స్, కాన్సులర్ సర్వీస్ ప్రొవైడర్ మారుతుండడంతో సాధారణ అపాయింట్‌మెంట్లు అందుబాటులో ఉండవని తెలిపింది.

Advertisement

Advertisement