హైదరాబాద్: 28°C
వార్తలు

200 మీటర్ల లోతైన లోయలో పడిన వాహనం

Advertisement

ఉత్తరాఖండ్ చంపావత్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బారాకోట్ పరిధిలోని బాప్రూ-బంటోలి రహదారి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న టాటా పంచ్ వాహనం అదుపు తప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Advertisement