ELR: ముసునూరు మండల పరిధిలో రైతులకు కంటి మీద కునుకులేకుండా చేసిన మోటార్ వైర్ల దొంగల ముఠాను ఎస్ఐ ఎం. చిరంజీవి పట్టుకున్నారు. సుమారు పది మంది రైతుల పొలాల్లో వైర్లు దొంగిలించిన నిందితులను, రాత్రిపూట గస్తీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు గంజాయికి బానిసలని, మత్తు కోసం ఈ దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు.
వార్తలు
మోటార్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


