హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ

Advertisement

కృష్ణా: పెడన మండలంలో అన్ని రైతు సేవ కేంద్రాల్లో రైతులకు సబ్సిడీపై వరి విత్తనాల పంపిణీ చేస్తామని మండల వ్యవసాయ అధికారిణి ఎస్.జెన్నీ గురువారం ఒక ప్రకటనలో అన్నారు. కిలో విత్తనానికి రూ.5 సబ్సిడీ అందిస్తున్నామని, విత్తనాలు అవసరమైన రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ వివరాలతో సంబంధిత రైతు సేవ కేంద్రాలను సంప్రదించి విత్తనాలను పొందవచ్చని ఆమె తెలిపారు.

Advertisement

Advertisement