హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

Advertisement

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చంపా ప్రాంతం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ భయానక ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

Advertisement