GDWL: సుంకేసుల జలాశయానికి మంగళవారం ఎగువ నుంచి 9,850 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీనితో డ్యామ్ యొక్క రెండు గేట్లను ఒక మీటరు మేర ఎత్తి, 8,950 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 292 మీటర్ల గరిష్ఠ నీటి మట్టం కలిగిన ఈ డ్యామ్‌లో ప్రస్తుతం 291.90 మీటర్ల నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
సుంకేసులకు 9,850 క్యూసెక్కుల వరద
Advertisement
Advertisement
Advertisement


