MDK: నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట శివారులో పారట్ల కుమార్ (30) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన కుమార్, తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. నీలగిరి ప్లాంటేషన్‌లో అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
నీలగిరి తోటలో యువకుడి మృతదేహం
Advertisement
Advertisement
Advertisement


