MDK: నిజాంపేట మండలంలోని పాత బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పనులు పూర్తయినా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులు స్టాప్‌లో ఆపకుండా వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో ఓ బస్సు డ్రైవర్‌తో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. పాత బస్టాండ్ వద్ద బస్సులు ఆగకపోవడంతో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
వార్తలు
'బస్సు ఆగడం లేదని ప్రయాణికుల ఆందోళన'
Advertisement
Advertisement
Advertisement


