హైదరాబాద్: 28°C
వార్తలు

యూరియా యాప్‌ను రద్దు చేయాలి: రైతులు

Advertisement

TG: ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్‌తో ఇబ్బందులు పడుతున్నామంటూ జాగిర్యాల్‌ గ్రామ రైతులు సొసైటీ గోదామును ముట్టడించి నిరసన తెలిపారు. యాప్ వినియోగంపై అవగాహన లేదని, చాలా మంది వద్ద స్మార్ట్‌ ఫోన్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ వల్ల యూరియా దొరకడం లేదని, తక్షణమే దీన్ని రద్దు చేయకపోతే ప్రభుత్వానికి రైతుల ఆగ్రహం తప్పదని వారు హెచ్చరించారు.

Advertisement

Advertisement