హైదరాబాద్: 28°C
వార్తలు

ఒమన్‌ తీరంలో నిలిచిపోయిన భారత నౌక

Advertisement

ఒమన్‌ తీరంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న ఓ నౌక సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. 'MSV విరాట్- 1' అనే ఈ నౌకలో భారత్‌కు చెందిన 14 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, ఇంజిన్ వైఫల్యం కారణంగానే ఈ నౌక నిలిచిపోయిందని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. నౌకలోని సిబ్బందిని సురక్షితంగా తరలిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ‘X’ వేదికగా ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Advertisement