హైదరాబాద్: 28°C
వార్తలు

ఒకే రోజు TET, RRB ఎగ్జామ్స్.. వాయిదా వేయాలి?

తెలంగాణ టెట్, RRB పరీక్షలు జూన్ 17న ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని BRS నేత ప్రవీణ్ కుమార్ చెప్పారు. 'టీచర్ పోస్టులు, రైల్వే ఉద్యోగాలకు అభ్యర్థులు కష్టపడి సిద్ధమయ్యారు. ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని TET పరీక్షను ప్రభుత్వం వాయిదా వేయాలని కోరుతున్నా' అని ట్వీట్ చేశారు.