హైదరాబాద్: 28°C
వార్తలు

రష్యా చమురు కొనుగోళ్లలో భారత్ రికార్డు

Advertisement

పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. మే నెలలోనే భారత్ రష్యా నుంచి ఏకంగా రూ.52 వేల కోట్ల విలువైన ముడి చమురును కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. దేశీయ ఇంధన అవసరాలు, తక్కువ ధరకే లభిస్తుండటంతో రష్యా చమురు దిగుమతులను భారత్ భారీగా పెంచింది. కాగా, చైనా మొదటి స్థానంలో కొనసాగుతోంది.

Advertisement

Advertisement