హైదరాబాద్: 28°C
వార్తలు

ఒడిశా వైపుకు ఏనుగుల గుంపు

Advertisement

పార్వతీపురం మన్యం జిల్లాలో తిష్ఠవేసిన ఏనుగుల గుంపు ఆదివారం ఉదయం ఒడిశా వైపు పయనమయ్యాయని అటవీ శాఖ అధికారులు  తెలిపారు. సాలూరు, మక్కువ మండలాల్లో గత 15 రోజులుగా తిరుగుతూ పంటలను నాశనం చేసి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన విషయం తెలిసిందే. ఒడిశాలోని పొట్టంగి పంచాయతీ పరిధిలోకి వెళ్లిపోయాయని సాలూరు ఫారెస్ట్ రేంజర్ అధికారి తవిటినాయుడు పేర్కొన్నారు.

Advertisement

Advertisement